చల్లపల్లికి చెందిన రాయవరవు గాయత్రి చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తల్లి కూలిపనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. కుమార్తెను చదివించే స్థోమత లేక ఇబ్బంది పడుతున్న సమాచారం మిత్రుల ద్వారా తెలుసుకున్న ఎస్సై సందీప్, గాయత్రికి పుస్తకాల ఖర్చును భరించి సాయంగా నిలిచారు. ప్రైవేట్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న గాయత్రికి ఇది వరుసగా రెండవ ఏడాది పుస్తకాలు అందజేసిన సందీప్ తన ఔదార్యంతో ప్రశంసలు పొందుతున్నారు.