అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు

83చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు
కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలంలో అసాంఘిక కార్యకలపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఎస్ఐ శిరీష హెచ్చరించారు. శనివారం ఆమె పోలీస్ స్టేషన్ లో మాట్లాడుతూ, మండలంలో పేకాట, కోడిపందాలు, ఇతర జూదాలు జరిగితే తక్షణమే ప్రజలు సమాచారం అందించాలని తెలిపారు. వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్