నాగాయలంక మండలంలోని నాలి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు పున్నయ్య (76) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. ఆయనకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి గ్రామంలో టీడీపీ బలోపేతానికి ఎంతో కృషిచేశారు. ఆయన మృతిపై మండల అధ్యక్షుడు లక్ష్మణరావు, జిల్లా కార్యదర్శి నాగాంజనేయులు సంతాపం తెలిపారు.