రైతులకు సమర్థవంతంగా సాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కోడూరు మండల మాజీ జడ్పిటిసి సభ్యులు బండే శ్రీనివాసరావు అన్నారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆదేశాల మేరకు ఇరిగేషన్ శాఖ వారు చేస్తున్న కోడూరు 13వ నెంబర్ పంట కాలువ పూడికతీత పనులను స్థానిక పార్టీ నేతలతో కలిపి శుక్రవారం పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ముద్దినేని చందర్రావు, పిల్లి మల్లికార్జున రావు తదితరులు పాల్గొన్నారు.