కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి

54చూసినవారు
కార్మికుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలి
కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని సిఐటియు నాయకులు సిహెచ్. రాజశేఖర్ డిమాండ్ చేశారు. అఖిల భారత కోర్కెల దినోత్సవ సందర్భంగా మోపిదేవిలో పలు సంఘాలకు చెందిన కార్మికులు ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ అన్ని రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంఘాల నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్