నియోజకవర్గంలో చట్టబద్ధమైన పాలన జరగాల్సిందే

77చూసినవారు
నియోజకవర్గంలో చట్టబద్ధమైన పాలన జరగాల్సిందే
అవనిగడ్డ నియోజకవర్గంలో ఇకపై చట్టబద్ధమైన పాలన జరగాల్సిందేననీ, రూల్ ఆఫ్ లా అమలు కావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అధికారులకు స్పష్టం చేశారు. బుధవారం చల్లపల్లిలో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఎంపీపీ కోట విజయ రాధిక అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిధిగా పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మాదిరిగా తన హయాంలో తప్పులు జరిగితే ఊరుకునేది లేదన్నారు. అనంతరం ఎమ్మెల్యేను సత్కరించారు.

సంబంధిత పోస్ట్