వైసీపీ నేతల ధన దాహంతోనే గత ప్రభుత్వంలో తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగించారని మాజీ ఎంపీపీ బండే కనకదుర్గ అన్నారు. సోమవారం సాయంత్రం అవనిగడ్డ వంతెన సెంటరులోని ఆంజనేయ స్వామి దేవాలయంలో డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు దీపారాధన నిర్వహించారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సతీమణి మండలి విజయలక్ష్మి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.