చెరువును తలపిస్తున్న వెంకటాపురం రహదారి

85చూసినవారు
చెరువును తలపిస్తున్న వెంకటాపురం రహదారి
చినుకు పడితే చాలు రహదారి చిత్తడిమయంగా మారడంతోపాటు చెరువును తలపిస్తుంది. కృష్ణాజిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం వెళ్లే రహదారి గోతులు మయంగా మారి వర్షపు నీరు నిలిచి ఉంది. ఆదివారం వర్షం భారీగా కురుస్తుండడంతో గోతుల్లో వర్షపు నీరు నిలిచి వాహనదారులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. రహదారులకు మరమ్మత్తులు చేపట్టి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్