అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా జి. యువకుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ సిఐగా పనిచేసిన ప్రజా బదిలీపై వేరే ప్రాంతానికి వెళ్లడంతో, యువ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రల పరిరక్షణకు ప్రజలు, వివిధ పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. పోలీసు సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.