ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్ కు దరఖాస్తులు

65చూసినవారు
ఐటీఐ రెండో విడత కౌన్సెలింగ్ కు దరఖాస్తులు
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో 2024-25 విద్యా సంవత్సరంలో మిగిలిన సీట్లకు రెండో విడత కౌన్సెలింగ్ కు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నామని సత్రంపాడు ప్రభుత్వ ఐటీఐ ప్రధానాధికారిణి పి. రజిత శుక్రవారం తెలిపారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను వెబ్ సైట్లో జులై 24వ తేదీలోపు సమర్పించాలన్నారు. ప్రభుత్వ ఐటీఐల్లో ప్రవేశాలకు జులై 27, 28వ తేదీల్లో, ప్రైవేటులో ప్రవేశాలకు 29, 30 తేదీల్లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్