ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కోర్టులున్న అన్ని ప్రదేశాల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె. రత్నప్రసాద్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయ సేవాసదన్ సమావేశపు హాలులో ఉదయం 10. 00 గంటలకు లోక్ అదాలత్ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన బెంచ్లను ఏర్పాటు చేశామని తెలిపారు.