బాపులపాడు మండలంలో శనివారం రాత్రి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. హనుమాన్ జంక్షన్, పెరికిడు, వీరవల్లి, కోడూరుపాడు ప్రాంతాల్లో ఉదయం నుంచి ఉక్కపోతతో ఇబ్బంది పడిన ప్రజలకు సాయంత్రానికి వాతావరణం చల్లబడటంతో కాస్త ఉపశమనం లభించింది. సాయంత్రం చల్లటి గాలులు వీచగా, హనుమాన్ జంక్షన్ ప్రాంతంలో వర్షం కురిసింది.