బాపులపాడు మండలం వీరవల్లికి చెందిన ఓ వ్యక్తిని సైబర్ తరహా నేరగాళ్లు బురిడీ కొట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆర్నేపల్లి రంగారావు సిమెంట్, ఇనుము వ్యాపారం నిర్వహిస్తుంటారు. శుక్రవారం సాయంత్రం ఈయనకు ఒక వ్యక్తి ఫోన్ చేసి తాను ఏఎస్ఐ ఆనందరావునని, ఎస్ఐకి అత్యవసరంగా రూ. 70వేలు నగదు కావాలని అడిగారు. ఫోన్ పే ద్వారా నగదు పంపించగా, తిరిగి నగదు రాకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.