బాపులపాడు మండల పరిధిలోని రంగన్నగూడెంలో గురువారం ఆటో బోల్తా పడి ఏడుగురు మహిళలకు గాయాలయ్యాయి. వీరంతా మోహన్ స్పిన్ టెక్స్ లో పనిచేస్తున్న వారు. కంపెనీకి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన మహిళలను చిన్న అవుట్టుపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆసుపత్రికి, విజయవాడ కామినేని ఆసుపత్రులకు తరలించారు.