బాపులపాడు: మండలంలో కుండపోత వర్షం

67చూసినవారు
బాపులపాడులో శుక్రవారం తెల్లవారుజామున కుండపోత వర్షం కురిసింది. మండలంలోని అంపాపురం, వీరవల్లి, ఏ. సీతారాంపురం, కోడూరుపాడు, బండారుగూడెం గ్రామాలలో వర్షం నీటితో రోడ్లు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. ఒకవైపు ఎండ వేడి, మరోవైపు వర్షం కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యానికి లోనయ్యారు.

సంబంధిత పోస్ట్