గన్నవరం మండలం బుద్దవరంలో ఏలూరు కాలువ వంతెన సమీపంలో రూ. 15 లక్షల విలువైన మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఈ పనులను గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు సోమవారం పరిశీలించారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో కాలువల పూడికతీత, మరమ్మతు పనులను వేగవంతంగా పూర్తిచేయాలని అధికారులను సూచించారు. సాగునీటి సరఫరాకు ఆటంకం రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.