బాపులపాడు మండలం కొయ్యూరు గ్రామంలో శుక్రవారం రాత్రి గన్నవరం టిడిపి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు పర్యటనలో గ్రామానికి చెందిన దళిత యువకుడు పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలో ప్రవేశించిన యార్లగడ్డ వెంకట్రావు అదే గ్రామానికి చెందిన జోజి అనే దళిత యువకుడు కూర్చుని లేవకపోవటంతో అదే గ్రామానికి చెందిన అగ్రకులాల వారు దాడికి పాల్పడ్డారు. ఘటనపై జోజి హనుమాన్ జంక్షన్ పోలీసులను ఆశ్రయించాడు.