బాపులపాడు మండలంలోని లోతట్టు ప్రాంత ప్రజలలు పునరాస కేంద్రాలకు రావాలని బాపులపాడు మండల తాసిల్దార్ నాగభూషణం తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు, బుడమేరు కాలువ పొంగటంతో మండలంలోని ఆరుగొలను, ఓగిరాల, రంగయ్య అప్పారావుపేట, రామన్నగూడెంలు ముంపుకు గురయ్యాయని కానుమోలు, ఆరుగొలను జిల్లా పరిషత్ హై స్కూల్ లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.