ఆలపాటి రాజేంద్రప్రసాద్ గెలుపు పెద్దల సభకు అలంకారమని ప్రభుత్వ విప్, గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ అన్నారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ను బలపరుస్తూ సోమవారం పోరంకిలోని మురళీ రిసార్ట్స్ లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్ అధ్యక్షతన గన్నవరం పట్టభద్రుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.