గన్నవరం: ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం

51చూసినవారు
గన్నవరం: ట్రాఫిక్ నియమాలపై అవగాహన కార్యక్రమం
కృష్ణ జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర రావు ఆదేశాల మేరకు జిల్లాలో జాతీయ రోడ్డు భద్రత మహోత్సవాలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ నెల 1 నుండి 31 దాకా జరిగే ఈ మహోత్సవాల్లో భాగంగా రోడ్డు భద్రత ట్రాఫిక్ నియమాలపై గన్నవరం ట్రాఫిక్ సిఐ వి.పెద్దిరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి ప్రయాణికులకు హెల్మెట్ వినియోగం, సీట్ బెల్ట్ తదితర ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్