గన్నవరం మండలం కేసరపల్లి పరిసరాలను శనివారం భద్రతా బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. ఎస్‌ఎల్‌వీ సమీపంలోని సభా ప్రాంగణం, పరిసరాలను శనివారం క్షుణ్నంగా తనిఖీలు చేపట్టి ముందస్తు గస్తీ నిర్వహించారు. ముగ్గురు ఎస్పీలు, ఆరుగురు అదనపు ఎస్పీలు, 15 మంది డీఎస్పీలు, 45 మంది సీఐలు, 112 మంది ఎస్సైలు, 2, 195 ఏఎస్సై, హెచ్‌సీ, పీసీలు, 490 హోంగార్డు సిబ్బందిని మోహరించనున్నామని ఎస్పీ గంగాధరరావు వెల్లడించారు.