ఈనెల 10వ తేది శుక్రవారం గన్నవరంలో జాబ్ మేళా నిర్వహిస్తునట్టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ డీకే బాలాజీ గురువారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. నైపుణ్యాల అభివృద్ధి మరియు శిక్షణ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను గన్నవరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నందు జాబ్ మేళాని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.