ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభ మేళాలో గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే, ఏపీ ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు శనివారం పవిత్ర గంగ స్నానం ఆచరించారు. ఆయనతో పాటు మంత్రి కొల్లు రవీంద్ర, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, టీడీపీ సీనియర్ నాయకులు చెరుకూరి వసంత్ కుమార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలకృష్ణ గురూజీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని కోరుతూ గంగమ్మకు పూజలు చేసారు.