జనవరి 5వ తేది ఆదివారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న హైందవ శంఖారావం సభను జయప్రదం చేయాలని గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావ్ పిలుపునిచ్చారు. శనివారం కేసరపల్లిలో జరగనున్న హైందవ శంఖారావం సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే పార్థసారధిని అభినందించారు. పార్థసారధి ఇక్కడే ఉండి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేసారని అన్నారు.