గన్నవరం మండల పరిధిలోని కేసరపల్లిలో ఈ నెల 5న నిర్వహించనున్న హైందవ శంఖారావ సభను పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు గన్నవరం నుంచి రామవరప్పాడు వరకు ట్రాఫిక్ పూర్తిగా నిలిపివేస్తున్నట్లు శనివారం పోలీసులు తెలిపారు. హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలు చిన్నఅవుటుపల్లి పిన్నమనేని హాస్పిటల్ ఎదురుగా కొత్త బైపాస్ రోడ్లో వెళ్లి నున్న గ్రామం నుంచి పాయికాపురం మీదుగా విజయవాడ వెళ్లాలన్నారు.