గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్ బెయిల్ పై ఇరుపక్షాల వాదనలు పూర్తయిన నేపథ్యంలో శుక్రవారం సీఐడీ కోర్టుర్ట్ తీర్పును వెలువరించనుంది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ. 71 గా వంశీ ఉన్నారు. మరోపక్క నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ చేశారని హనుమాన్ జంక్షన్ లో వంశీపై కేసు నమోదు కావడంతో న్యాయమూర్తి నూజివీడు కోర్టులో వంశీని హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది.