గన్నవరం: వంశీ ఆరోగ్యం అస్సలు బాగాలేదు: వంశీ భార్య పంకజ శ్రీ

56చూసినవారు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ఆరోగ్యం పట్ల ఆయన భార్య ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం నూజివీడు కోర్టు సెంటర్ లో వల్లభనేని పంకజ శ్రీ మీడియా తో మాట్లాడారు. వంశీకి తీవ్ర జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనిఆమె వాపోయారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని వైద్యులు సూచించినప్పటికీ రోజుకొక కొత్త కేసులతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు.

సంబంధిత పోస్ట్