ఊటుకూరు రామాలయంలో వైభవంగా గోపూజ

874చూసినవారు
ఊటుకూరు రామాలయంలో వైభవంగా గోపూజ
గంపలగూడెం మండలం ఊటుకూరు శ్రీ కోదండరామస్వామి దేవాలయంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం వైభవంగా గోపూజ నిర్వహించారు. ఆలయ అర్చకులు రామకృష్ణాచార్యులు ముందుగా సీతారామ లక్షణులు, ఆంజనేయస్వామి, రాజ్యలక్ష్మి, గోదాదేవి మూల విరాట్లను ప్రత్యేక పూజలు చేసి పుష్పమాలలతో అలంకరించారు. మహిళా భక్త బృందం కమిటీ సభ్యులు భజన కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్