ప్రయాగ్ రాజ్ మహా కుంభ మేళాకు కృష్ణా జిల్లా టీడీపీ నాయకులు వెళ్లారు. ఈ సందర్భంగా వారు కుంభమేళాలో శనివారం పవిత్ర స్నానం ఆచరించారు. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్, మంత్రి కొల్లు రవీంద్ర, టీడీపీ సీనియర్ నాయకుడు చెరుకూరి వసంత్ కుమార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాలకృష్ణ గురూజీ పవిత్ర స్నానం ఆచరించిన వారిలో ఉన్నారు.