మామిడికుదురు మండల పరిధిలోని గ్రామపంచాయతీలో జరుగుతున్న కులగణనలో జరుగుతున్న తప్పులను సవరించాలని కోరుతూ దళిత సంఘం నేతలు శుక్రవారం తహసీల్దార్ ఆచార్యులకు వినతిపత్రం ఇచ్చారు. కొందరు వ్యక్తుల పేర్లు వద్ద మతం అనే చోట ఖాళీగా ఉన్నాయని, మరికొన్ని గ్రామాల్లో కొందరి పేర్లు జాబితాలో లేవని పేర్కొన్నారు. వీటిని సవరించాలని కోరారు. కార్యక్రమంలో పల్లంరాజు, మనిరాజు, జనార్ధన్, మహేశ్, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.