జీవితంలో ఎంత ఎదిగినా ఒదిగిన వారికే ప్రజలలో సంఘంలో గుర్తింపు వస్తుందని, అలాంటి గుర్తింపు పొందిన వారిలో కొంగా మాణిక్యాలరావు ఒకరని చెప్పడంలో అతిశయోక్తి లేదని పలువురు వక్తలు కొని యాడారు. ఆదివారం గన్నవరం మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల ఏస్ ఏ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయులు, యుటిఎఫ్ నాయకులుకే. మాణిక్యాలరావు ఉద్యోగ విరమణ సందర్భంగా రాయ నగర్ కల్యాణ మండపంలో అభినందన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.