గన్నవరం మండలం ముస్తాబాద పెద్ద చెరువు నుంచి పదకొండు రోజులుగా మట్టి తవ్వకాలు కొనసాగుతున్నాయి. మంగళవారం సాయంత్రం వేగంగా వెళ్తున్న మట్టి ట్రాక్టర్ హైస్కూల్ వద్ద బైక్‌పై వెళ్తున్న సూరంపల్లికి చెందిన గజ్జల వెంకటేశ్వరరావు(55)ను ఢీకొనగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ ఘటనపై బుధవారం కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. అక్కడ తెదేపా నాయకులు, బాధితుని బంధువుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.