నున్న ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం ఘనంగా అండర్ - 19 బాలబాలికల జాతీయ లంగడి పోటీలను ప్రారంభించినట్లు కార్యనిర్వాహక కార్యదర్శి బూదోటి శివరాం తెలిపారు. ఈ పోటీలకు భారతదేశంలోని వివిధ రాష్ట్రాల నుండి సుమారు 360 మంది బాలబాలికలు హాజరైనట్లు తెలిపారు. జనవరి 12 వరకు ఈ పోటీలు ఎంతో ఉత్సాహంగా జరుగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో భారత లంగడి సంఘ కార్యదర్శి సురేష్, ఏపీ సభ్యులు రమేష్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.