పొట్టిపాడు: రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడి మృతదేహం

60చూసినవారు
పొట్టిపాడు: రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడి మృతదేహం
ఉంగుటూరు మండలం పొట్టిపాడు రైల్వే గేట్ సమీపంలో మంగళవారం తెల్లవారుజామున రైలు పట్టాలపై గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతుడిని గుర్తించే పనిలో ఉన్నారు. ఇది ప్రమాదమా, హత్యా.? లేక ఆత్మహత్యా.? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్