గన్నవరం విమానాశ్రయం నుండి హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంత బాధితులకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల నాణ్యతను బుధవారం రెవెన్యూ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. హెలికాప్టర్ల ద్వారా వరద ప్రాంత బాధితులకు సరఫరా అవుతున్న ఆహార పదార్థాల్లో నాణ్యత కొరవడిందని ఆరోపణలు వినిపిస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించారు.