తిరుపతమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి

72చూసినవారు
తిరుపతమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలి
తిరుపతమ్మ తల్లి చల్లని ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు అన్నారు. పాత గన్నవరంలోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ ఆలయంలో శ్రావణ మాస ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొలుత ఎమ్మెల్యే యార్లగడ్డ అమ్మవారి కి ప్రత్యేక పూజలు చేసారు. అనంతరం ఉత్సవాలను ప్రారంభించారు. డీజే లు, తీన్మార్ డబ్బులు, కోలాట బృందాలతో అమ్మవారి ఆలయ ప్రాంగణం పండుగ శోభ సంతరించుకుంది.

సంబంధిత పోస్ట్