ఉంగుటూరు మండలం పొట్టిపాడులో ఏలూరు కాలువ వంతెన శిథిలాస్థకు చేరింది. వంతెనకు ఇరువైపులా ఉన్న గోడలు విరిగిపోయి ప్రమాదకరంగా మారాయి. నిత్యం ఈ వంతెనపై రైతులు, ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. ఆదమరిస్తే కాలువలో పడే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు. ఈ వంతెనపై రహదారి సైతం గుంతలు ఏర్పడి ప్రమాదాలను తలపిస్తున్నాయని వాహన దారులు వాపోయారు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.