కృష్ణా విశ్వవిద్యాలయం నెట్‌బాల్ మహిళల జట్టును ఎమ్ఆర్ ఏఆర్ కాలేజ్ అఫ్ పీజీ స్టడీస్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జె నవీన లావణ్యలత ఆదివారం ప్రకటించారు. ఎంపికైన ఈ జట్టు జనవరి 7 నుండి 9వరకు జైపూర్ లోని సురేష్ జ్ఞాన్ విహార్ యూనివర్సిటీలో జరుగనున్న అఖిల భారత అంతర విశ్వవిద్యాలయల నెట్‌బాల్ మహిళల టోర్నమెంట్ లో పాల్గొంటారని తెలిపారు. ఈ జట్టుకి కోచ్ గా సత్యనారాయణ, మేనేజర్ గా దారం నవీన్ వ్యవహరిస్తున్నారన్నారు.