అమరావతి ద్రోహి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్, సజ్జల రామకృష్ణారెడ్డి డౌన్డౌన్ అంటూ టీడీపీ నాయకులు నినాదాలు చేశారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని వన్ సెంటరులో అమరావతి మహిళలపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టులను సమర్ధిస్తూ మాట్లాడిన సజ్జల రామకృష్ణారెడ్డి దిష్టిబొమ్మను టీడీపీ నాయకులు సోమవారం రాత్రి దగ్ధం చేశారు.