గుడివాడలో అంబేడ్కర్ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కోతి బొమ్మ సెంటర్ వద్ద ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాణంలో డాక్టర్ అంబేడ్కర్ పోషించిన పాత్ర అపూర్వమని వారు తెలిపారు. సమాన హక్కుల కోసం పోరాడిన మహానేత ఆశయాలను ప్రజలు పాటించాలన్నారు. ఈ సందర్భంగా యువతకు అంబేడ్కర్ ఆలోచనలు ప్రేరణగా నిలవాలని పిలుపునిచ్చారు. వేడుకల్లో పెద్ద సంఖ్యలో నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.