గుడ్లవల్లేరులో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. నూతన సాంకేతిక పరిజ్ఞానం, ఆయిల్ పామ్ ప్రాముఖ్యత, పద్ధతులు, కలుపు యాజమాన్యం గురించి భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి శాస్త్రవేత్తలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు సునీల్, కీర్తి తదితరులు పాల్గొన్నారు.