గుడివాడ జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ గుడివాడ నియోజకవర్గ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు శనివారం పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళలు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ద్వారా కుటుంబంలో మొత్తం ఎంత మంది పిల్లలు ఉంటే అంత మందికి ఈ పథకం ద్వారా డబ్బులు జమ చేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు.