ఉయ్యూరులో కూటమి ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమం

77చూసినవారు
ఉయ్యూరులో కూటమి ప్రభుత్వం విజయోత్సవ కార్యక్రమం
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడిచిన సందర్భంగా ఉయ్యూరులోని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వైవిబి రాజేంద్రప్రసాద్ కార్యాలయంలో విజయోత్సవ కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భాగస్వామ్యంతో సంక్షేమం, అభివృద్ధితోపాటు రాష్ట్ర పునర్నిర్మాణం కోసం శక్తి వంచన లేకుండా పని చేస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్