లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ

51చూసినవారు
లబ్ధిదారులకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ
గుడివాడ నియోజకవర్గంలోని పెన్షన్ లబ్ధిదారులకు ఒకటో తేదీ ఉదయం 6 గంటల నుండి లబ్ధిదారుల ఇంటి చెంతనే పెన్షన్ల పంపిణీ జరగాలని గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు వెనిగండ్ల రాము తెలిపారు. శుక్రవారం స్థానిక టిడిపి ప్రజావేదికలోని తన చాంబర్లో మున్సిపల్ మరియు మండల పరిషత్ అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో పెన్షన్ల పంపిణీపై అధికారులు తీసుకుంటున్న చర్యలను అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్