కంచికచర్లలో పురుగులు మందు తాగి వృద్ధుడు మృతి

72చూసినవారు
కంచికచర్లలో పురుగులు మందు తాగి వృద్ధుడు మృతి
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం గండేపల్లి గ్రామంలో ఆవుల ఏడుకొండలు (65) అనే వృద్ధుడు పురుగుల మందు తాగి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం ఏడుకొండలు మూడు ఎకరాల పొలం కౌలుకు చేస్తూ ఉంటాడని, వ్యవసాయం కోసం అప్పుచేసి ఖర్చు పెట్టాడని, వ్యవసాయంలో నష్టం రావడం మరియు ఆరోగ్యపరమైన ఇబ్బందులుతో పాటు ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువ అవడంతో బుధవారం పురుగులు మందు తాగి మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్