గుడివాడలో తృటిలో అగ్ని ప్రమాదం తప్పింది. పట్టణంలోని ఏలూరు రోడ్డులోని చేపల మేత గోడౌన్ లో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. విద్యుత్ మీటర్ నుంచి మంటలు బయటపడి గోడౌన్‌లో వ్యాపించగా, పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తమై మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో స్వల్ప నష్టం మాత్రమే జరిగిందని స్థానికులు చెప్పారు.