అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని, ఇళ్ళు నిర్మాణంకు 4 లక్షల రూపాయలు మంజూరు చేయాలని, 50 సంవత్సరాల నిండిన వారికి పెన్షన్ లు మంజూరు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు కామ్రేడ్ కోటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం గన్నవరం పట్టణంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు నాయకత్వంలో నిరుపేదలతో భారీ ర్యాలీ నిర్వహించారు