కాల్వలు, డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు

54చూసినవారు
కాల్వలు, డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు
గుడివాడ నియోజకవర్గంలోని ఇరిగేషన్ కాల్వలు, డ్రైన్లలో సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు అయినట్లు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సాగునీటి చానల్స్ అభివృద్ధికి రూ. 1. 58 కోట్లు, మురుగునీటి డ్రెన్లలో తూడు, కాడ తొలగింపుకు రూ. 90. 30లక్షలు నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. కాలువల్లో జరిగే అభివృద్ధి పనులను ఎక్కడికక్కడ రైతులు దగ్గరుండి పర్యవేక్షించాలని రాము విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్