మేము ఏ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నామో చెప్పండి మహాప్రభో అంటూ వినూత్న రీతిలో నిరసనకు దిగిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. మండల కేంద్రమైన గుడ్లవల్లేరు పక్కన మామిడికోళ్ల రోడ్డులో కరెంటు స్తంభాలకు లైట్లు వేయవలసి ఉందని గుడ్లవల్లేరులో అడిగితే కవుతరంలో అడగమని కవుతరంలో అడిగితే గుడ్లవల్లేరులో అడగమని చెబుతున్నారని మేము ఏ గ్రామానికి చెందుతామనేది అధికారులు చెప్పాలని కోరుతూ నిరసన కార్యక్రమంని నిర్వహించారు.