గుడివాడలో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి బస్టాండ్ చెరువుని తలపిస్తుంది. బస్టాండ్ లో వర్షపు నీరు చేరడంతో లోపలికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా మారిందని బుధవారం ప్రయాణికులు వాపోయారు. గుడివాడ బస్టాండ్ ను శాశ్వతంగా నిర్మించడం లేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో బస్టాండ్ గ్యారేజ్ నిర్మాణం చేపట్టారు. అధికారులు వెంటనే స్పందించి, వర్షపు నీరును మోటర్ల ద్వారా తొలగించాలని వారు కోరుతున్నారు.